హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సిలబస్‌ను అప్డేట్ చేస్తూ ఆయా పోటీ పరీక్షలకు అవసరమైన 42 పుస్తకాలను తెలుగు అకాడమి ముద్రించింది. నూతనంగా ముద్రించిన ఈ పుస్తకాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమం, చరిత్రతో పాటు ఇతర పుస్తకాలు రేపట్నుంచి తెలుగు అకాడమిలో అందుబాటులో ఉండనున్నాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనతో పాటు తదితరులు పాల్గొన్నారు.