హైదరాబాద్, జూ లై1 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసనస భాపక్ష ఉపనేత హరీశ్‌రావు చర్చలకు వస్తే మేమూ సిద్ధం. గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్దకు ముగ్గురం మంత్రులం వ స్తం’ అని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూ రి లక్ష్మణ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకులాల టెండర్లలో అవినీతిపై బీఆర్ఎస్ రాష్ట్రనేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విసిరిన సవాల్‌పై మంత్రి స్పందించారు. కేటీఆర్, హరీశ్‌ను ప్రవీణ్‌కుమార్ తీసుకొస్తే, తాము చర్చలకు సిద్ధమేనని పేర్కొన్నారు. వారిద్దరు కాకుండా ప్రవీణ్‌కుమార్ ఒక్కరే వస్తే ఆయన స్థాయికి తగ్గట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అన్ని ఆధారాలతో చర్చలకు సిద్ధంగా ఉంటారని తెలిపారు.
ఎమ్మెల్యేలతోనే చర్చలకొస్తం: పొన్నం
సంక్షేమశాఖలపై, గురుకులాల టెండర్లపై చర్చలకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. బాధ్యత గల మంత్రిగా శాసనసభ్యులైన బీఆర్ఎస్ మాజీ మంత్రులు వస్తే తాము కూడా ప్రెస్‌క్లబ్ వేదికగా చర్చలకు సిద్ధమేనన్నారు. లేదంటే అసెంబ్లీలో చర్చకు వస్తామని తెలిపారు.