హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేదర్ సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగారు. అధికారులకు, వర్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.