హైదరాబాద్ : రైతులను కడుపులో పెట్టుకొని కాపాడేది రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. యాసంగి వరిధాన్యం కొనమని కేంద్రంలోని బాధ్యతా రాహిత్యమైన బీజేపీ ప్రభుత్వం తెగేసి చెప్పిందని విమర్శించారు. తెలంగాణ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అన్నం పెట్టే రైతన్న ఆగం కావొద్దని సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో చివరి గింజ వరకూ కొంటామని చెప్పడం హర్షణీయమన్నారు.
రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యావత్ తెలంగాణ రైతాంగానికి భరోసానిచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంతో ధాన్యం కొనిపిస్తామని వరి వేయండని రెచ్చగొట్టిన బీజేపీ నేతలు చేతులెత్తేసి.. పత్తా లేకుండాపోయారన్నారు. వారి ఓట్ల కుటిల రాజకీయ మాటలు అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఉండగా తెలంగాణకు ఏమీ కానివ్వరని, ఎన్నటికైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అన్నారు.