Check Posts | తెలంగాణలో రవాణాశాఖ చెక్‌పోస్టులు తొలగిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని చెక్‌పోస్టులను ఎత్తివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో చెక్కు పోస్టులు ఎత్తివేస్తూ జీవో జారీ చేశామన్నారు. చెక్‌పోస్టుల రద్దు చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగించేందుకు.. ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో జరగడానికి జరగడానికి చెక్ పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల కిందట నిర్ణయం తీసుకొని.. ఈ రోజు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత రూ.577 కోట్ల టాక్స్ ప్రభుత్వం మినహాయించిందన్నారు. ఇవీ వెహికిల్ అమ్మకాల షేర్ నుంచి 0.03 నుంచి 1.13 షేర్ పెరిగిందన్నారు.
ఢిల్లీలో పొల్యూషన్లో ఉండే పరిస్థితి లేదని.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చామన్నారు. ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు 10 వేలు చొప్పున అనుమతి ఇచ్చామన్నారు. 25వేల రేటిరోఫిటింగ్ ఆటోలకు అనుమతి ఇచ్చామన్నారు.
రాష్ట్రంలో వాహన్ అమలవుతుందని.. సారథి త్వరలోనే తీసుకొస్తామన్నారు. స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చామని.. వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చామన్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లో రికార్డ్ చేస్తూ రెగ్యులర్‌గా వచ్చే వాళ్లని నోట్ చేసి హెడ్ ఆఫీస్‌కి అలెర్ట్ చేస్తుందని.. అలాంటి వాటిని నిరోధించడానికి ఉపయోగిస్తున్నామన్నారు. వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామన్నారు. డ్రైవింగ్ మీద మంచి నైపుణ్యాలు పెంచడానికి అవగాహన కలిగించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రోడ్ సేఫ్టీ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాచారంలో గవర్నర్ ప్రారంభించారని.. కరీంనగర్లో ప్రారంభించుకున్నామన్నారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. టూరిజం వెహికల్స్‌కి డబుల్ నెంబర్ ప్లేట్‌తో పోతున్నాయని ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. రోడ్ సేఫ్టీ క్లబ్స్ కాలేజీలలో జూనియర్, డిగ్రీ ఇతర వాటిలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని.. దాని అమలుపై మెడికల్, పోలీస్, నేషనల్ హైవేస్‌తో సమీక్ష సమావేశం జరిగిందన్నారు. రవాణా శాఖ రెవెన్యూ కలెక్షన్ చేసే డిపార్ట్మెంట్.. 112 మంది ఏఎంవీఐలను నియమించి వారికి శిక్షణ ఇచ్చి తీసుకున్నామన్నారు. నలుగురు ఆర్టీవోలను గ్రూప్-1 ద్వారా వచ్చారని.. రవాణా శాఖకు ఒక లోగో తీసుకువచ్చామన్నారు. తెలంగాణ పోలీస్, ఫారెస్ట్ మాదిరి లోగో తీసుకున్నామని.. టీఎస్‌ని టీజీగా మార్చామని.. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నారు. ఇల్లీగల్ , ఓవర్ లోడింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నామని.. చెక్‌పోస్టులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలకు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో1.7 కోట్ల వాహనాలు ఉన్నాయన్నారు. వాటన్నిటిని రోడ్ ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
డిపార్ట్మెంట్లో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. పాత వాహనాలు డబుల్ నంబరింగ్ అరికట్టడానికి మైనింగ్, ఇతర వాహనాలకు మొదటగా చూస్తున్నామన్నారు. రవాణా శాఖ లోని 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని.. బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్ శాఖ, ఆర్టీసీ ఇతర విభాగాలలో పాత వాహనాలకు స్క్రాప్ కి పంపించాలని లేఖ రాసినట్లు చెప్పారు. చెక్కు పోస్టులను రద్దు చేయాలని తానే ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకుపోయి కేబినెట్లో ఈ అంశాన్ని పెట్టినట్లు పొన్నం వివరించారు. వచ్చే ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని.. గత 10 సంవత్సరాల్లో పాపాల పుట్ట లాగ అవినీతి జరిగిందన్నారు. వాహన్ సారథిలో 28 రాష్ట్రాలు ఉన్నాయని.. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదని.. ఇప్పుడు తాము వాహన్ సారథిలో చేరామని.. డేటా టాన్స్ఫార్మింగ్ జరుగుతుందని.. వాహన్ అమలు చేస్తున్నామని.. సారథి అమలు చేస్తామన్నారు. చెక్ పోస్టుల రద్దు చేసినా వాహనాల్లో అక్రమ రవాణా జరుగకుండా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా చేస్తామని చెప్పుకొచ్చారు.