హైదరాబాద్ : మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ల బదిలీల(Transfers) విషయంలో పారదర్శకత(Transparency) పాటిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) అన్నారు. లాంగ్ స్టాండింగ్లో ఉన్నవారికి స్థాన చలనం తప్పదన్నారు. కొందరు ఉన్నతాధికారుల అండతో కొంతమంది అధికారులు ఒకేచోట పాతుకుపోయారు. అలాంటి అధికారులు లూప్లైన్లోకి వెళ్లక తప్పదన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు.