కరీంనగర్ : కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాలలో(Sports school) విద్యార్థుల సంఖ్యను పెంచాలని, స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar )అన్నారు. ధ్యాన్ చంద్(Dhyan Chand) జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాలలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్ క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాలను మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్టీఎల్ కింద చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన కట్టడాలపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఎంత వారినైనా ఉపేక్షించకుండా ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.