హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 30 వరకు ఇంటింటి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే) నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల మంది ఎన్యూమరేటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడు ఉంటారని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్టాయి అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటికీ తిరిగి కుటుంబాల సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారని తెలిపారు.
30లోగా డేటా ఎంట్రీతో పాటు గా సమాచార సేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నదని తెలిపారు. సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అన్నిరకాల పథకాలు పొందేందుకు ఈ సర్వే దోహదపడుతుందని, ప్రతి ఒకరూ సమగ్ర సమాచారం తెలుపాలని కోరారు.