సుల్తాన్‌బజార్, జూలై 14: విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం ఆబిడ్స్‌లోని రెడ్డి బాలుర వసతి గృహంలోని ఆడి టోరియంలో రెడ్డి జన సంఘం (ఆబిడ్స్) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి చెందిన ఇంజినీరింగ్, మెడికల్, గ్రాడ్యు యేషన్లో మెరిట్ సాధించిన 353 మంది విద్యార్థులకు రూ.30 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మొదట రాజా బహదూర్ వెంకటరామ్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్న రెడ్డి జన సంఘం కృషి అభినంద నీయమని కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, నల్లగొండ ఎంపీ కుందూరి రఘువీర్‌రెడ్డిని జన సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి నర్సింహారెడ్డి సలహాదారులు ప్రొఫెసర్ కంచర్ల దశరథ్‌రెడ్డి, కోశాధికారి కాశిరెడ్డి పాండురంగాకరెడ్డితో కలిసి ఉపకార వేతనాల దాతలు డాక్టర్ మహిపాల్ రెడ్డి, ఆర్జేఎస్ సుకన్యారెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బాలకృష్ణారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో రెడ్డి జన సంఘం అబిడ్స్ ఉపాధ్యక్షుడు తీగల బాల్‌రెడ్డి, సుకన్యారెడ్డి, స్వరూపారాణి, కార్యదర్శి డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, కో శాధికారి వీరారెడ్డి, సభ్యులు తీగల మోహన్‌రెడ్డి, మర్రి ప్రభాకర్‌రెడ్డి, భారతి, మర్రి వామన్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, టాంకాం మాజీ చైర్మన్ బోయపల్లి రంగారెడ్డి పాల్గొన్నారు.