హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌ను బలోపేతం చేయడంతోపాటు అందరికీ సులువుగా అర్థమయ్యేలా మార్పులు చేర్పులు చేపట్టబోతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ధరణి కమిటీ సభ్యులు సచివాలయంలో మంత్రి పొంగులేటితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధరణి కమిటీ సిఫారసులపై సుధీర్ఘంగా చర్చించామని, తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించే ముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రంలో భూ సంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించడంతోపాటు 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ యాక్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. భూ వివాదాల పరిషారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసి, ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించిందన్నారు. గత ప్రభుత్వం పార్ట్-బీలో ఉంచిన భూ సమస్యలను పరిషరించడానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో ధర ణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్ కుమార్, మధుసూదన్ పాల్గొన్నారు.
ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వారంలో పరిష్కరించాలని సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ధరణి దరఖాస్తులపై సమీక్షించారు. జిల్లాల వారీగా పెండింగ్ దరఖాస్తులు, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల స్థాయి లో పరిష్కరిస్తున్న విధానంపై అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షలకుపైగా పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి.