Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28 వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న వారు గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. దరఖాస్తులు అందజేసిన తర్వాత ప్రజలకు అధికారులు ఒక రశీదు ఇస్తారని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర దరఖాస్తులు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మీకు ఇచ్చిన టైమ్‌లో అప్లికేషన్లు ఇవ్వలేకపోయినా.. ఆనాడు రద్దీ ఉండటం వల్ల దరఖాస్తులు ఇవ్వలేతే టెన్షన్ పడక్కర్లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ గ్రామంలో సంపూర్ణంగా అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి అప్లికేషన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామసభలకు వచ్చే వారి నుంచి చిత్తశుద్ధితో దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు. గ్రామసభలకు వచ్చే వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. గ్రామ సభల నిర్వహణకు కావాల్సిన నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు.