ఖమ్మం, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి(Minister Ponguleti) నిరసన సెగ తగిలింది. అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు(Double bedroom houses) ఎలా ఇచ్చారంటూ ఓ గిరిజన కుటుంబం మంత్రిని చుట్టుముట్టింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని సాక్షాత్తూ మంత్రి సొంత నియోజకవర్గమైన పాలేరులోనే చోటుచేసుకుంది. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం దుబ్బతండాలో డబుల్ బెడ్ రూం ఇళ్లను సోమవారం ప్రారంభించిన మంత్రి పొంగులేటి.. వాటిని లబ్ధిదారులకు అందజేశారు.
అయితే, ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో అర్హుల పేర్లు తొలగించడాన్ని, అనర్హుల పేర్లు జాబితాలో వెల్లడిం చడాన్ని గమనించిన ఓ గిరిజన కుటుంబం వెంటనే మంత్రి ఎదుటే నిరసనకు దిగింది. అర్హుడినైన తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఎందుకు ఇవ్వలేదంటూ అదే తండాకు చెందిన బోడా సేవా, అతడి తల్లి, భార్య అక్కడే ఆందోళన చేపట్టారు. అర్హుల జాబితాలో నిన్న (ఆదివారం) తన పేరును ప్రకటించిన అధికారులు.. ఇవ్వాళ (సోమవారం) ఇళ్ల ప్రారంభోత్సవం నాటికి జాబితా నుంచి తన పేరును ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించారు. వెంటనే మంత్రి పొంగులేటిని ఆ మహిళలు చుట్టుముట్టారు.
సాగు భూములు ఉన్న వారికి కూడా ఈ 29 డబుల్ బెడ్ రూం ఇళ్లలో చోటు కల్పించారని ఫిర్యాదు చేశారు.
కానీ సాగు భూమి, ఇల్లు కోల్పోయిన తమకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తమ అర్హతను పరిశీలించి తమకు ఇల్లు ఇవ్వాలని కోరారు. దీంతో సంబంధిత అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేశారని అధికారులను ప్రశ్నించారు. ఎంపిక విధానం పారదర్శకంగా ఉండాలని, అర్హులకే ఇళ్లు ఇవ్వాలని సూచించారు. ఈ ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికపై మరోసారి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ డబుల్ బెడ్ రూం పథకంలో ఇళ్లు రాని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మాట ఇచ్చారు.
మంత్రి పొంగులేటి మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం పై జనం తిరుగుబాటు
అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చారని ఆరోపణనచ్చచెప్పినా వినిపించుకోకుండా మంత్రితో వాగ్వాదానికి దిగిన గిరిజన మహిళలు. సహనం కోల్పోయి గిరిజనులు, స్థానిక అధికారులపై… pic.twitter.com/qPUbBRgxap
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025