Niranjan Reddy | రాజన్న సిరిసిల్ల : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక కష్టాలు పడ్డాం.. కానీ తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్( CM KCR ) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
తంగళ్లపల్లి మండలం జిల్లెల శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ కాలేజీని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రసంగించారు.
నేటి తరానికి మార్గదర్శకత్వం, రేపటి తరానికి నాయకత్వం వహించే దక్షత ఉన్న నాయకుడు కేటీఆర్ అని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. ఆధునిక వసతులు, సాంకేతికత పద్దతులతో కూడిన వ్యవసాయ కళాశాల రావడం స్థానిక విద్యార్ధుల అదృష్టం అని పేర్కొన్నారు. సిరిసిల్ల భవిష్యత్‌కు నెలవుగా మారిందననారు. ఊబికి వచ్చిన భూగర్భ జలాలలో రాజన్న సిరిసిల్ల రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఐఏఎస్‌లకు పాఠంగా మారిందని గుర్తు చేశారు.
దేశంలో 700 లోపే వ్యవసాయ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 73 ప్రభుత్వ వ్యవసాయ కాలేజీలు కాగా, మిగతావన్నీ ప్రయివేటు కాలేజీలు అని తెలిపారు. దేశంలో సరిపడా వ్యవసాయ కాలేజీలు లేవన్నారు. వ్యవసాయ రంగంపై కేసీఆర్ రూ. 4 లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ కొత్త విప్లవాన్ని సృష్టించిందన్నారు. దేశంలో మొత్తం 95 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు అవుతుందన్నారు. జరిగిన పనిని… జరుగుతున్న పనిని మెచ్చుకుంటూ జరగాల్సిన పనిపై సూచనలు చేయాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల సమీపంలో రూ.69 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో మంత్రి @SingireddyBRS గారు, స్పీకర్ @PSRTRS గారు, ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి @KTRBRS గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు @vinodboianpalli గారు pic.twitter.com/ahD0DU8Mj5
— Singireddy Niranjan Reddy (@SingireddyBRS) April 12, 2023