హైదరాబాద్ : రెడ్‌హిల్స్ ఫ్యాప్పీలో సీడ్స్‌మెన్ అసోసియేషన్ వార్షిక భేటీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడ్స్‌మెన్ అసోసియేషన్ ఫౌండర్ యోగేశ్వరరావుకు విత్తనరంగ పితామహుడు బిరుదుతో పాటు జీవిత సాఫల్య పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత ప్రపంచానికి అన్నంపెట్టే దేశంగా భారత్ నిలుస్తుందన్నారు.
యువత సాగు వైపు మొగ్గు చూపితే దేశ భవిష్యత్తుకు మేలు జరుగుతుందన్నారు. యువత సాగువైపు మళ్లేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విత్తనరంగాన్ని శాసించే స్థాయికి తెలంగాణ ఎదగాలని పేర్కొన్నారు. విత్తనరంగంలో కంపెనీలు పరిశోధనలు పెంచాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. శాస్త్రవేత్తలు కూడా కాలానికి అనుగుణంగా మారాలని సూచించారు.