వనపర్తి, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ): వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వాట్సాప్ డీపీలతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించ వద్దని, మెస్సేజ్‌లకు రిైప్లె ఇవ్వొద్దని మంత్రి సూచించారు.
తన పేరుతో వాట్సప్ మెసేజ్‌లు (9353849489) పంపుతూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు.