Minister Niranjan Reddy | పామాయిల్ సాగులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ : మంత్రి నిరంజన్‌రెడ్డి
Minister Niranjan Reddy | వెనుకబడిన ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని విజయవర్ధనే ఆయిల్ మిల్లు ప్రాంగణంలో రూ.200 కోట్లతో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ సంస్థ నిర్మిస్తున్న పామాయిల్ కర్మాగార పనులకు మంగళవారం మంత్రి నిరంజన్‌రెడ్డి భూమి పూజ చేశారు.
జోగుళాంబ గద్వాల : వెనుకబడిన ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని విజయవర్ధనే ఆయిల్ మిల్లు ప్రాంగణంలో రూ.200 కోట్లతో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ సంస్థ నిర్మిస్తున్న పామాయిల్ కర్మాగార పనులకు మంగళవారం మంత్రి నిరంజన్‌రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు పండడంతో 2003లో 95 ఎకరాలోల విజయవర్ధనే ఆయిల్‌మిల్లు ఏర్పాటు చేయగా, ఆంధ్రా పాలకుల దాష్టీకానికి అనతికాలంలోనే ఫ్యాక్టరీ మూతపడిందని గుర్తుచేశారు. ఆ ఫ్యాక్టరీని ఆంధ్రా పాలకులు అమ్మకానికి పెడితే.. తాము ఉద్యమం చేస్తే వెనక్కి తగ్గారన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో ఎన్డీడీబీకి ఆయిల్‌మిల్లు అప్పుగా ఉన్న రూ.36 కోట్లలో వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ప్రభుత్వం రూ.8.42 కోట్లను చెల్లించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం సాగువైపు రైతులను ప్రోత్సహిస్తున్నదన్నారు. రైతులకు ఎకరాకు రూ.50,900ను సబ్సిడీ కింద ఇస్తున్నదన్నారు. ఈ పంట సాగులో దేశంలో తెలంగాణనే నంబర్‌వన్‌లో ఉందన్నారు. వరి, గోధుమ సాగులో స్వామినాథన్ కొత్త వంగడాలను సృష్టించారన్నారు.
మన శాస్త్రవేత్తలను ప్రపంచం మెచ్చుకుంటే మనం మాత్రం గౌరవించుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నడిగడ్డలో ఏర్పాటుకానున్న కర్మాగారంలో గంటకు 30 టన్నుల పామాయిల్ గెలలను క్రష్ చేయొచ్చని పేర్కొన్నారు. పంటసాగు పెరిగే కొద్దీ క్రషింగ్ సామర్థ్యం పెంచుకోవచ్చాన్నారు. కర్మాగారం ఏర్పాటుతో ప్రత్యక్షంగా 400, పరోక్షంగా 1400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
టెక్నికల్ ఉద్యోగులు తప్పా అందరిని ఈ ప్రాంతం వారినే నియమిస్తామన్నారు. రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో పామాయిల్ కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉద్యానవన శాఖ అదనపు కమిషనర్ సరోజిని, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

