Minister Niranjan Reddy | సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసం వద్ద మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు మంత్రి సమక్షంలో 55 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ గురుకుల పాఠశాలలు, పేదలకు ఇళ్లు (డబుల్ బెడ్ రూమ్), వెనుకబడిన తరగతుల (BC) సమాజానికి ఆర్థిక సహాయ కార్యక్రమం, ఆరోగ్య లక్ష్మి, దళితబంధు పథకాలు తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించవన్నారు.
దేశానికి ఆదర్శంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు, రైతుబీమా, రైతుబంధు పథకాలు అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ఆచరిస్తున్నదని, దేశం అనుసరిస్తున్నదన్న ఆయన.. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు. శనివారం ఏదులలో రైతన్నల సంబరాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మల్లేశ్, చిన్నఊశన్న, యాదయ్య, రాము, సాయన్నతో పాటు 55 మంది ఉన్నారు.