హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): స్టాక్ మార్కెట్లో 1992 స్కాం మరోసారి పునరావృతం అవుతుందా? అనే అనుమానాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. 1992లో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కాం బయటపడిన విషయం విదితమే. ఈ కుంభకోణంలో ఇన్వెస్టర్లు లక్షల డాలర్లు నష్టపోయారు. ఆ ఇతివృత్తాన్ని 1992-ఏ స్కాం పేరుతో సినిమా కూడా తీశారు.
ఆ సినిమాను తాను చూశానని మంత్రి కేటీఆర్ తెలిపారు. 30 సంవత్సరాల తరువాత ఇద్దరు గుజరాతీ సోదరులు దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లుతున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తంచేశారు. దేశంలో ఏం మారింది… చరిత్ర పునరావృతం అవుతుంది అంటూ ట్వీట్ చేశారు.