హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ) : తెలంగాణకు ఎన్డీయే ప్రభుత్వం ఏమిచ్చిందో చూపించడానికి మీ వద్ద పెద్ద గుండుసున్నా మాత్రమే ఉన్నప్పుడు మీరు నల్ల పిల్లులు, తాంత్రికులపైనే ఆధారపడాల్సి ఉంటున్నదని మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘పిచ్చోడి చేతిలో రాయి- లవంగం చేతిలో బీజేపీ’ అని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నల్ల పిల్లులు, తాంత్రికులతో పూజలు నిర్వహించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ విధంగా ట్విట్టర్ ద్వారా స్పందించారు.