ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 11:07:43

పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు

పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్ :  ఆదివాసీల సంప్రదాయ నృత్యం గుస్సాడీ. ఈ నృత్యానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన కళాకారుడు కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి  కేటీఆర్‌ కనకరాజుకు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గుస్సాడీ గజ్జెల సవ్వడిని ఢిల్లీకి విని‌పించిన కన‌క‌రాజు కుమ్రంభీం జిల్లా జైనూరు మండలం మర్లవా‌యి వాసి. ఇంది‌రా‌గాంధీ, అబ్దుల్‌ కలాం తదితర దేశ ప్రము‌ఖుల సమ‌క్షంలో గజ్జె‌కట్టి గుస్సాడీ ఆడిన ఘనుడు ఆయన. 43 ఏండ్లుగా వంద‌ల‌మంది యువ‌కు‌లకు గుస్సాడీ, ధింసా నృత్యా‌ల్లో కనకరాజు శిక్షణనిచ్చారు. గుస్సా‌డీకి ఆయన చేసిన సేవ‌లను గుర్తించిన కేంద్రం ప్రతి‌ష్ఠా‌త్మక పద్మశ్రీ పుర‌స్కారం ప్రక‌టించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo