హైదరాబాద్ : మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీ సందర్భంగా బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి రాష్ట్ర బృందం స్పష్టత కోరనుంది. కేంద్రమంత్రి గోయల్‌తో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీలు, అధికారులు భేటీ కానున్నారు.