KTR | హైదరాబాద్ : తెలంగాణలో తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ముందు గడచిన 58 ఏండ్లలో జరిగిన పనులు దిగదుడుపేనని స్పష్టమవుతున్నది. ఈ రంగం.. ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో తెలంగాణ అనేక విజయాలను నమోదు చేసింది. ఈ మేరకు ఆయా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించిన మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాధించిన విజయాలతో తెలంగాణ ప్రజానీకం వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్కై జై కొడుతున్నట్లు తెలిపారు.
‘గడచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, అంతకుముందు 58ఏళ్లలో జరిగిన పనులను చూడండి. అభివృద్ధికి ఓటెయ్యండి… కారు గుర్తుకు ఓటెయ్యండి.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో 11దఫాలు కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన పనులు, రెండు దఫాల్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఫలితంగా ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాక.., సిర్పూర్ నుంచి అలంపూర్ దాక, భద్రాచలం నుంచి జహీరాబాద్ దాక.., తాండూరు నుంచి చెన్నూర్ దాక, మధిర నుంచి ముధోల్ దాక, మక్తల్ నుంచి జుక్కల్ దాక, తెలంగాణ అంతటా కారు జోరు కొనసాగుతున్నదని, మళ్లీ కేసీఆర్ సర్కారే రానున్నదని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. వివిధ రంగాల్లో గతంలో జరిగిన పనులు, గడచిన తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతితోపాటు వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టనున్న కొత్త పథకాలను ఆయన వివరించారు.
ఆదిలాబాద్ నుండి అచ్చంపేట దాకా…
సిర్పూర్ నుండి అలంపూర్ దాకా…
భద్రాచలం నుండి జహీరాబాద్ దాకా…
తాండూర్ నుండి చెన్నూర్ దాకా…
మధిర నుండి ముదోల్ దాకా…
మక్తల్ నుండి జుక్కల్ దాకా…
తెలంగాణ అంతటా కారు జోరు!
మళ్లీ రానున్నది కేసీఆర్ సర్కారు!#KCRHattrick pic.twitter.com/tNisyEppU5— KTR (@KTRBRS) November 28, 2023
What was done in last 9 years by KCR Govt Versus 58 years of Previous Govts
Numbers speak for themselves
Vote for Progress, Vote for CAR#TelanganaWithKCR pic.twitter.com/iBtrfkyXwT
— KTR (@KTRBRS) November 28, 2023