KTR | హైదరాబాద్ : జాతీయ పంచాయతీ అవార్డుల్లో( National Panchayat Awards ) తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఉత్తమంగా నిలిచి మరోసారి మెరిసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్ వన్, ఉత్తమ గ్రామ పంచాయతీలు, 100 శాతం ఓడీఎఫ్లోనూ తెలంగాణ పల్లెల్లు నంబర్ వన్‌గా నిలిచాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR )కే దక్కుతుందన్నారు. కేసీఆర్ మానసపుత్రిక పల్లెప్రగతి( Palle Pragathi )తో గ్రామాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఆయన బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో తెలంగాణ అత్యధిక అవార్డులను గెలుచుకుంది. మొత్తం 27 అవార్డుల్లో 8 పురస్కారాలను తెలంగాణ పల్లెలు కైవసం చేసుకున్నాయి.
Telangana shines yet again ✊
Best performer in National Panchayat Awards
✅ Highest Rise in Per Capita
✅ Best Gram Panchayats
✅ 100% ODF + Villages as per Govt of IndiaAll credit to Visionary CM KCR Garu and his brainchild “Palle Pragathi” which has uplifted the villages… pic.twitter.com/Esc38P7zwA
— KTR (@KTRBRS) April 7, 2023