హైదరాబాద్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలోని ఆదివాసీల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తన ట్వీట్లో పేర్కొన్నారు. గూడెంలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ది ఆదివాసీల కళను సీఎం కేసీఆర్ తీర్చారని పేర్కొన్నారు. జోడేఘాట్‌లో కుమ్రం భీం మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం జిల్లా అని నామకరణం చేశామన్నారు.
Hon’ble CM #KCR Garu has delivered on the promise of “Mava Nate, Mava Raj” by formation of New Gudem Gram Panchayats
Built a beautiful Museum for Sri Komuram Bheem at JodenGhat & also named the Asifabad district after him
“Adivasi Bhavan” at Hyderabad is soon to be inaugurated pic.twitter.com/u9RQ5hQpf4
— KTR (@KTRTRS) August 9, 2022