హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా తెలంగాణ సర్కారు ‘కూల్‌రూఫ్ పాలసీ 2023-28’ని రూపొందించింది. ఈ పాలసీని మాసబ్‌ట్యాంకులోని సీడీఎంఏ కార్యాలయంలో సోమ వారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో దేశంలోనే కూల్‌రూఫ్ పాలసీని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించనున్నది. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. పట్టణాల్లో ఎండవేడిమి ప్రభావంతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించడం, విద్యు త్ను ఆదా చేయడం ఈ పాలసీ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని వేడిని తట్టుకొనే రాష్ట్రంగా మార్చడమే దీని ఉద్దేశమని తెలిపారు. కూల్రూఫ్లతో సాంప్రదాయ గృహాలతో పోలిస్తే ఇంట్లోని ఉష్ణోగ్రతలు 2.13 నుంచి 4.3 డిగ్రీల మేర తక్కువగా ఉంటాయని వివరించారు. అలాగే, దీనికి పరిమిత నిర్వహణ మాత్రమే అవసరమని పేర్కొన్నారు. దీంతో 20% విద్యుత్ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రం లో కూల్‌రూఫ్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని, అనుసరించేవారికి ప్రోత్సాహకాలు ఇస్తా మని వెల్లడించారు. ఈ విధానంపై భవన యజమా నులకు అవగాహన కల్పిస్తామని కేటీఆర్ చెప్పారు.