హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): సమిష్టిగా కృషిచేస్తే ఏదైనా సాధించవచ్చని దేశానికి తెలంగాణ చూపించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘దేశంలో 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేంద్రం ప్రకటించిన 30 శాతం అవార్డులను గెలుచుకున్నది. అదే తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమానికి ఉన్న శక్తి.
సమిష్టిగా కృషిచేస్తే ఏమి సాధించవచ్చో దేశానికి చూపించింది. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన ప్రతీ పంచాయతీరాజ్ అధికారి, ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.