హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చేనేత కార్మికులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఉప ఎన్నికల్లో ఓటుతో బీజేపీకి బుద్ధి చెప్పాలని సూచించారు. చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనే అని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. పొదుపు, బీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసిందన్నారు. నేతన్నల భవిష్యత్‌ను బీజేపీ అగమ్యగోచరంగా మారుస్తున్నదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా బడ్జెట్ ఇచ్చి నేతన్నలను ఆదుకుంటోందని కేటీఆర్ స్పష్టం చేశారు.