హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): అదానీ కుంభకోణం, హిం డెన్‌బర్గ్ నివేదిక గురించి ప్రస్తావించే దమ్ము లేదు కానీ, బిలియనీర్ జార్జ్ సోరస్ చేసిన కామెంట్స్‌పై మాత్రం కొందరు ఉలిక్కిపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఆదివారం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. జార్జ్ సోరస్ వ్యాఖ్యలు చేయగానే, వారి గురువును కాపాడుకునేందుకు కొందరు చాలా ఆతృత కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవో చెప్పుకోండి? చూద్దాం అంటూ ట్వీట్లో యూజర్లను అడిగారు.