హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ట్వీట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని నగర సీపీని ఆదేశించారు.
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హోదాతో సంబంధం లేకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.