మహబూబ్ నగర్ : అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు( Voter ) జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ( C. Laxmareddy ) సూచించారు. కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల పట్టణంలో బీఎల్వో ( BLO) నుంచి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సర్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
బీఎల్వోలు ప్రతి ఇంటికీ చేరి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలని కోరారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ విజయవంతం చేయాలని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బలమైన ప్రజాస్వామ్యానికి ప్రతి ఓటు విలువైనదే. నా ఓటు.. నా హక్కు అనే భావనతో సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు.
ప్రజాస్వామ్య బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా అత్యంత అవసరమని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం,వివరాలను సరిచేసుకోవడం, కొత్త ఓటర్లను చేర్చడం అందరి బాధ్యత అని మాజీ మంత్రి పేర్కొన్నారు.