హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ యాదవ్ తీవ్రమైన పోరాటం చేశారని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదంతో మరో టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని ఆశిస్తున్నాను అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Best wishes to TRS student wing president @GelluSrinuTRS Garu who has been announced as the @trspartyonline candidate in upcoming Huzurabad by-election
— KTR (@KTRTRS) August 11, 2021
He fought hard in Telangana agitation & hopefully another TRS student leader will enter Assembly with blessings of the people👍 pic.twitter.com/0dIBaY3d5s