హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98.5 శాతం పూర్తయిందని ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఎంహెచ్వో బృందానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ సూచనలు, మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు.
Congratulations Collector Garu & DMHO team 👏 https://t.co/K8NmPztAs7
— KTR (@KTRTRS) September 29, 2021