హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): నారాయణపేట సమీకృత మార్కెట్ బాగున్నదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.
నారాయణపేటలోని సమీకృత మార్కెట్‌ను తాను ప్రారంభించానని, డిజైన్, స్థల వినియోగం బాగున్నదని ట్విటర్ వేదికగా చెప్పారు. ఇతర మార్కెట్లను ఇదే తరహాలో నిర్మించాలని మున్సిపల్ ఉన్నతాధికారులు అర్వింద్ కుమార్, ఎన్ సత్యనారాయణకు సూచించారు.