హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అంధకారమేనని, ఇక్కడివారికి పాలన రాదని హేళన చేసిన ఎంతోమంది నోళ్లు మూయించింది తెలంగాణ. అంతేకాదు.. రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ తన సత్తా చాటుతూ దేశంలో తనకు సాటి లేదని నిరూపించుకున్నది. అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో దేశానికి దారి చూపింది. దేశ ప్రగతికి తెలంగాణ ఒక మాడల్‌గా నిలిచింది. సమైక్య పాలనలో విధ్వంసకర పరిస్థితులను నెమరువేసుకుంటూనే… కలబడి నిలబడిన తెలంగాణ వికాసం వైపు పరుగులు తీస్తున్న తీరును దేశం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు తెలంగాణకు అవార్డులు ఇచ్చేందుకు బారులు తీరాయి. ఈ 8 ఏండ్లలో వందలకు పైగా అవార్డులు తెలంగాణను వరించాయి. కేవలం గ్రామ పంచాయతీలకే 79 వరకు అవార్డులు వచ్చాయి.
దేశ విదేశీ ప్రతినిధులను ఆకర్షిస్తున్న తెలంగాణ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురోగమిస్తున్న తెలంగాణను కేంద్ర ప్రభుత్వంతోపాటుగా పలు రాష్ర్టాల, పలు దేశాల ప్రతినిధులు ఏదో ఒక సందర్భంలో వచ్చి ఇక్కడి పాలనా ఔన్నత్యాన్ని, ఇకడి పథకాలు, పల్లెల, పట్టణాల పురోభివృద్ధిని చూసి ముచ్చట పడుతున్నారు. జేజేలు పలుకుతున్నారు. ఏవిధంగా అమలు చేస్తున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. ఒక మిషన్ భగీరథ పథకంపై 13 రాష్ట్రాలు అధ్యయనం చేసి వెళ్లాయి. దేశంలో ఎకడా లేని రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుపై 20కి పైగా దేశాలు అధ్యయనం చేశాయి. ప్రపంచంలో ఎతె్తైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటి వరకు 20 రాష్ట్రాల ప్రతినిధులు సందర్శించి వెళ్లారు. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నేతలు కాళేశ్వరం, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను తిలకించి మురిసిపోయారు.
మహిళా, శిశు సంక్షేమాభివృద్ధిలో భేష్
పర్యావరణం, అటవీ అభివృద్ధిలో అగ్రగామి
పథకాలు కాపీ

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అత్తెసరు సహాయంతో అమలు చేస్తున్నది. అనేక రాష్ర్టాలు ఈ పథకాలను అమలు చేస్తామని చెప్తున్నాయి. చెరువుల పునరుద్ధరణకు తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకం తరహాలో ‘అమృత్ సరోవర్’ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని మోదీ సరారు నిర్ణయించింది. గత ఏప్రిల్ 24న జమ్ములో ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని స్వయంగా కేంద్రమే తెలిపింది. 2019-20 లో వైద్య, ఆరోగ్య రంగంలో 100 పాయింట్లకుగాను 69.95 పాయింట్లు సాధించి ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. బీజేపీ పాలిత రాష్ట్రాలే తెలంగాణ అభివృద్ధిపై చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అనేక అవార్డులు వచ్చాయి.
చేపల పెంపకానికి…

చెరువుల్లో చేపల పెంపకం చేపట్టిన ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం అవార్డుతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతి అందించింది.
2021కి తెలంగాణ మత్స్యశాఖకు అగ్రి-ఫుడ్ ఎంపవర్మెంట్ అవార్డు.
మన పోలీస్‌కు సెల్యూట్

2021 సంవత్సరానికి గ్రామీణ విభాగంలో ఉత్తమ ఠాణాగా ఆలేరు పోలీసుస్టేషన్ ఎంపిక(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఏటా దేశవ్యాప్తంగా 75 పోలీసు స్టేషన్లను ప్రాథమికంగా ఎంపిక చేసి వాటి పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. అలా జాతీయ స్థాయిలో ప్రకటించిన మొదటి పది ర్యాంకులలో ఈ ఠాణాకు స్థానం దకింది.)
పంచాయతీ రాజ్ శాఖకు 79 జాతీయ అవార్డులు

తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట పండుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు వచ్చాయి, ఈ ఏడాది దేశంలోని 20 అత్యుత్తమ గ్రామాలను ఎంపిక చేయగా వాటిలో 19 తెలంగాణకు చెందినవే. జాతీయ అవార్డుల్లో ఇదో రికార్డు.
విద్యుత్ రంగంలో…

వైద్యానికి ప్రశంసలు, కుటుంబ సంక్షేమానికీ అవార్డులు

ఉన్నత విద్యలోనూ జేజేలు

(కరోనా కాలంలో పాఠశాలఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. బోధన నైపుణ్యం, వికాస తరగతులు, ఆన్లైన్ ద్వారా పోటీ పరీక్షలు నిర్వహించి విద్యాభివృద్ధికి కృషి చేసినందుకుగాను భారతి ఫౌండేషన్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది.)
రోడ్లకూ …

కరీంనగర్ లోని కేబుల్ బ్రిడ్జికి ఔట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో జాతీయస్థాయి అవార్డు (ఇండియన్ కాంక్రీట్ ఇన్‌స్ట్టిట్యూట్ హైదరాబాద్ సెంటర్ ఈ అవార్డును ప్రదానం చేసింది.)
ఎయిర్‌పోర్టుకు…

స్టార్టప్‌లకూ…

హైదరాబాద్‌లోని పలు స్టార్టప్ కంపెనీలకు జాతీయ స్టార్టప్ అవార్డులు వచ్చాయి.
(ఈ అవార్డులను జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని పురసరించుకొని ఆయా రంగాల్లోని స్టార్టప్ కంపెనీలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అందించారు. మొత్తం దేశవ్యాప్తంగా 46 సంస్థలకు ఈ అవార్డులను ప్రకటించగా ఇందులో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు మూడున్నాయి.)
ఉపాధి కల్పనలో అగ్రస్థానం..

దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పుంజుకొంటున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో నియామకాలు 6% పెరిగినట్టు మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ (ఎంఈఐ) వెల్లడించింది. 16% వృద్ధిరేటుతో హైదరాబాద్ తృతీయ స్థానంలో నిలిచినట్టు పేర్కొన్నది. ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 39% వృద్ధిరేటుతో తొలి స్థానాన్ని కైవసం చేసుకొన్నది. హైదరాబాద్ తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ కూడా 39% వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (35 శాతం), బెంగళూరు (31 శాతం), ముంబై (29 శాతం) ఉన్నాయి. నౌకరీ డాట్ కామ్ సంస్థ విడుదల చేసిన నౌకరీ జాబ్ స్పీక్ – ఫిబ్రవరి 2022 నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాలు భారీగా జరుగుతున్నట్టు తేలింది. గతంతో పోల్చితే 43 శాతం పెరిగినట్టు అధ్యయనం సూచిస్తున్నది. గత ఏడాది జనవరిలో 3,908, ఫిబ్రవరిలో 3020గా ఉన్న నియామక సూచీ… ఈ ఏడాది ఫిబ్రవరిలో 4,329కి చేరుకున్నది. దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలపై ఆ సంస్థ ప్రతినెలా అధ్యయనం చేస్తున్నది.
రైతుబంధు

ప్రారంభించిన సంవత్సరం: 2018
నిర్దేశిత లక్ష్యం: రైతులకు వానకాలం, యాసంగి పంటల సాగుకు రూ.10 వేల పెట్టుబడి సాయం అందించడం
లబ్ధిదారుల సంఖ్య: 50.25 లక్షల మందితో మొదలై 63 లక్షలకు చేరుకున్నది.
సాధించిన ఫలితం: రైతుల మరణాలు తగ్గుముఖం.
కేసీఆర్ కిట్

ప్రారంభించిన సంవత్సరం: 2017
నిర్దేశిత లక్ష్యం: ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవిస్తే మగబిడ్డకు రూ.12 వేలు, ఆడబిడ్డకు 13 వేలు
లబ్ధిదారుల సంఖ్య: 13, 29,951
సాధించిన ఫలితం: సంస్థాగత ప్రసవాల శాతం 91-97 శాతానికి పెరుగుదల ప్రసూతి మరణాలు 92 నుంచి 56 శాతానికి తగ్గింపు, నవజాత శిశు మరణాలు 39 నుంచి
23 శాతానికి తగ్గింపు, పిల్లల వ్యాక్సినేషన్ రేటు 68% నుంచి 96 శాతానికి పెరుగుదల