భువనేశ్వర్ : భారత రక్షణ వ్యవస్థ మరో మైలురాయిని అందుకుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డీఆర్డీవో బుధవారం ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్‌ను స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశామని, దీనికి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసిందని రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
2025 డిసెంబర్లో ఇదే రాకెట్ ను 120 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించారు. ప్రస్తుతం ఈ రాకెట్ పరిధి 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల మధ్యలో ఉంది. ఈ ప్రయోగంతో రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరిందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.