అమిత్‌షా ఏం ముఖం పెట్టుకొని వస్తున్నవ్.. 27 ప్రశ్నలకు జవాబివ్వు
కేంద్ర మంత్రికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
గుజరాత్‌పై అమిత ప్రేమ.. తెలంగాణపై సవతి ప్రేమా?
కేంద్రం కడుపు నింపితే.. మా కడుపు కొడుతారా?
చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు అమలుచేయరెందుకు?
ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
‘బయ్యారం’ హామీని ఎందుకు తుప్పు పట్టించారు?
పాలమూరు-రంగారెడ్డికి జాతీయహోదా ఇవ్వరేం?
లక్షల మంది మెడిసిన్ చదవలేకపోతుంటే బాధ లేదా?
ఒక్క కేంద్ర విద్యాసంస్థనూ కేటాయించలేదెందుకు?
పవర్‌లూం టెక్స్టైల్ క్లస్టర్ ఇవ్వక శీతకన్నెందుకు?
పసుపు బోర్డు ఇస్తామని ఎందుకిస్తలేరో చెప్పగలరా?
హైదరాబాద్‌లో వరదలొస్తే పైసా ఇవ్వలేదేం?: కేటీఆర్
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై బీజేపీది అదే కక్ష.. ఎనిమిదేండ్లుగా అదే వివక్ష కొనసాగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రం కేంద్రం కడుపు నింపుతున్నా, కేంద్రం తెలంగాణ కడుపు కొట్టడం మానటం లేదని విమర్శించారు. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ర్టానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్రం చేస్తున్న అన్యాయాలు, వివక్ష, కక్షపై 27 ప్రశ్నలను సంధించారు. తెలంగాణకు వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు బీజేపీ జాతీయ నాయకులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇంకెంతకాలం తెలంగాణపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైందని, ఈ గడ్డపై అమిత్ షా అడుగుపెడుతున్న వేళ.. విభజన చట్టంలోని హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవటంతోపాటు, వాటి కోసం తెగే దాక కొట్లాడటం తమ బాధ్యత అని కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న అనేక కీలకాంశాలు అమిత్ షా దృష్టికి తెస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంపై వల్లమాలిన ప్రేమను, తెలంగాణపై సవతి తల్లి ప్రేమను ఇలాగే కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
1. విభజన చట్టంలో తెలంగాణకు కొన్ని నిర్దిష్టమైన హామీలను పార్లమెంట్ సాక్షిగా భారత ప్రభుత్వం ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ అంటే ప్రేమ ఉన్నట్టు చెప్పుకొన్న మీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చేందుకు చేసిన ప్రయత్నమేంటి? ఏ ఒక హామీనైనా మీ ప్రభుత్వం నెరవేర్చిందా?
2. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల డిమాండ్. ఎన్నో సార్లు మేం అడిగితే దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని కేంద్రంలోని మీ ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది వాస్తవం కాదా?
3. కానీ, నిన్న మొన్ననే రూ.20 వేల కోట్లతో మీ సొంత రాష్ట్రం గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకోవటం తెలంగాణపై మీకున్న చిన్నచూపునకు నిదర్శనం కాదా? మీ గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీ ఎలా పెడతారు? మా కాజీపేటలో ఎందుకు పెట్టరు?
4. తెలంగాణకు ఎన్డీయే సర్కారు ఇచ్చిన ఒక విద్యాసంస్థ పేరైనా మీరు చెప్పగలరా? ఐఐఎం, ఐసర్, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాల్లో ఏ ఒకటీ ఎందుకు కేటాయించలేదో జవాబు చెప్పగలరా?
5. గుజరాత్లో ఓ మెడికల్ విద్యార్థికి అడ్మిషన్ సమయంలో అన్యాయం జరిగిందని బాధపడిన ప్రధాని మోదీ వార్తలు చూశాం. అర్హత కల విద్యార్థికి అన్యాయం జరిగితే ప్రధాని స్పందించటం బాగుంది కానీ.. కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు. ఫలితంగా లక్షలాది తెలంగాణ బిడ్డలు మెడిసిన్ చదువుకోలేకపోతున్నారు. మరి మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ప్రధాని మోదీకి, మీకు ఎందుకు బాధ కలగటం లేదు?
6. విభజన చట్టం ప్రకారం కేంద్రం బయ్యారంలో ఉకు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. తెలంగాణ బాగుపడితే చూడలేని మీ కక్షపూరిత వైఖరితో న్యాయంగా దకిన ఆ హామీని ఎందుకు తుప్పు పట్టించారో చెప్తారా?
7. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినా పెట్టుబడులను ఆకర్షించటంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తున్నది. అయితే విభజన చట్టంలో ఉన్న పారిశ్రామిక రాయితీలను తెలంగాణకు ఎందుకు ఇవ్వటం లేదు?
8. ఐటీ రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న మీ పార్టీ, ప్రభుత్వ కుట్రలకు ఐటీఐఆర్ రద్దు పరాకాష్ఠ కాదా?
9. ఐటీఐఆర్‌ను రద్దు చేసిన మీరు.. ప్రత్యామ్నాయంగా ఐటీ అభివృద్ధికి చేపట్టిన ఒక కార్యక్రమాన్నైనా చెప్పగలరా?
10. ఐటీఐఆర్ పోవటంతో ఇకడి యువతకు దకకుండా పోయిన ఉద్యోగాలపై ఏం జవాబిస్తారు?
11. ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణలో ఐటీ అభివృద్ధి కోసం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను ఎందుకు ఇవ్వటం లేదు?
12. పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు. ఇన్నేండ్లయినా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదు?
13. పక్కనే కర్ణాటక అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించటం తెలంగాణ రైతాంగం పట్ల మీ వివక్ష పూరిత వైఖరికి నిదర్శనం కాదా?
14. తెలంగాణకు దకాల్సిన 575 టీఎంసీల సాగు నీటి వాటాల కేటాయింపులపై తెలంగాణ కోరుతున్నట్టు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయకుండా ఎనిమిదేండ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు అనే ఒక శిఖండి సంస్థను ఏర్పాటు చేసి, తెలంగాణకు సాగునీటి జలాల హకులు దకకుండా తాత్సారం చేస్తున్నది మీరు కాదా?
15. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా దకాల్సిన నిధులు కాకుండా, ప్రత్యేకంగా చేసిన సహాయం ఏమిటో చెప్పాలి?
16. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ.24 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఇప్పటిదాకా పైసా విదల్చలేదెందుకు? ఈ అంశంలో మీ పక్షపాత వైఖరిపై ఏం చెప్తారు?
17. సైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు అడిగితే ఏడేండ్లుగా తొకిపెడుతూ హైదరాబాద్ పౌరులను అవస్థలకు గురి చేస్తున్నది నిజం కాదా?
18. దేశంలో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని నదుల ప్రక్షాళనకు రూ.వేల కోట్లు కేటాయిస్తూ.. మా మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి మూడు పైసలు కూడా కేటాయించనిది నిజం కాదా?
19. హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ ఎరుగని వరదలు వస్తే మొండి చెయ్యి చూపి, గుజరాత్‌కు వేల కోట్ల వరద సాయం అందించారు. మా నగరానికి నయా పైసా ఇవ్వకుండా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని హైదరాబాద్‌కు వస్తున్నారు? ఇది మీకు సిగ్గుచేటు కాదా?
20. కొవిడ్ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ల తయారీతో దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన హైదరాబాద్ ఫార్మా రంగానికి అయువుపట్టుగా నిలిచేలా మేము ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి ఎందుకు సహాయం అందించటం లేదు?
21. ఎకో సిస్టం దికులేని చోటుకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను తరలించి, అగ్రగామి ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయటం లేదు?
22. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పారు కలిగిన తెలంగాణకు ఒక మెగా పవర్‌లూం టెక్స్టైల్ క్లస్టర్ కూడా ఇవ్వకుండా శీతకన్ను వేసింది నిజం కాదా?
23. తెలంగాణ రైతులు తమ ధాన్యాన్ని పంజాబ్ మాదిరే కొనాలని ఢిల్లీ వేదికగా కోరినా ఎందుకు కొనటం లేదు?
24. నిజామాబాద్‌కు పసుపుబోర్డు తీసుకొస్తానని మీ ఎంపీ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు. ఇంకా బోర్డును ఎందుకు ఏర్పాటు చేస్తలేరో చెప్పగలరా?
25. పెట్రో ధరలకు అసలు కారణమైన సెస్‌లను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్‌పై మీ వైఖరేంటి? మీరు దేశ ప్రజానీకంపై మోపిన సెస్‌లను రద్దు చేసి పెట్రో ధరలను తగ్గిస్తారో? లేదో? తెలంగాణ గడ్డపై నుంచి స్పష్టం చేస్తారా?
26. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో పెట్టబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. కానీ దాన్ని సైతం గుజరాత్‌కు తరలించిన మీది.. తెలంగాణపై పక్షపాత వైఖరి కాదా?
27. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఒక పైసా సహాయం చేయకపోగా, పోటీగా గుజరాత్లో మరో సెంటర్‌ను పెట్టింది వాస్తవం కాదా?