స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌పై కేటీఆర్ ప్రశంసలు
Minister KTR | గులాబీ కండువా కప్పుకున్న స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ నాయకత్వంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారని
హైదరాబాద్ : గులాబీ కండువా కప్పుకున్న స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ నాయకత్వంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. ప్రభావశీలమైన నాయకుడు దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్లో చేరడం శుభపరిణామం అని పేర్కొన్నారు. దాసోజు శ్రవణ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అని కేటీఆర్ ప్రశంసించారు. వీరిద్దరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
స్వామిగౌడ్, శ్రవణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో కలిసి పని చేసిన సహచరులం మేం. అక్కడక్కడ ఫంక్షన్లలో, ఇతర కార్యక్రమాల్లో కలుసుకునే వాళ్లం. ఆ సమయంలో పార్టీలను పక్కన పెట్టి ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్లం.. అనుబంధాన్ని పంచుకున్నా.. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ తిరిగి కలిసి పని చేసే గొప్ప అవకాశం కలిగింది. ఉద్యమంలో పని చేసిన ప్రతి బిడ్డ.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, కార్యక్రమాలను గమనించి వందకు వంద శాతం.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందని అంగీకరిస్తారని అనుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

