హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్లో అక్రమంగా రోడ్లు మూసివేస్తున్నారు. రోడ్ల మూసివేత వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ఉల్లంఘనను కేంద్రం ఎందుకు అడ్డుకోవట్లేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మీ జూనియర్ మంత్రికి కంటోన్మెంట్లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్లో 21 రోడ్లు నిబంధనలకు విరుద్ధంగా మూసివేశారు. మీ ప్రభుత్వం మాత్రం 2 గేట్లు మాత్రమే మూసివేశామని చెబుతుంది. కంటోన్మెంట్ బోర్డు స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే.. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో కలిపేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Sri @kishanreddybjp Garu and Sri @rajnathsingh Ji
— KTR (@KTRTRS) December 18, 2021
This highly objectionable & illegal closure of roads is causing heartburn among millions of civilians in and around the Secunderabad Cantonment area
What is preventing Govt of India from reining in violation of LMA rules? https://t.co/SI9xQuWgwh