హైదరాబాద్ : తన పాటల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సాహితీ లోకానికి, సినీ పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేటీఆర్.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తన పాటల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికి, సినీ పరిశ్రమకు తీరని లోటు.
— KTR (@KTRTRS) November 30, 2021
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
అలాగే నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం సిరివెన్నెల మృతికి సంతాపం తెలిపారు. ఆయన మరణవార్తను విని చాలాబాధపడ్డానన్నారు. అత్యద్భుతమైన పాటలను అందించి, ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప గేయ రచయిత అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.
Deeply saddened to hear the news of Sri #SirivennelaSitaramasastri Garu’s demise. A great lyricist who has given us the most beautiful songs to reminisce and who won the hearts of people with his incredible work. Condolences to the family. pic.twitter.com/LIbuf0cyqF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2021