KTR | న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా పర్యటిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హార్దిక్ సింగ్ పూరిని శనివారం మంత్రి కేటీఆర్ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. కేటీఆర్ వెంట ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కేటీఆర్ కలువనున్నారు.