Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. మునుగోడులో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేయగా, కేటీఆర్ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం కేటీఆర్ అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా స్వామితో పాటు తల్లిదండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్వామి ఇంట్లోనే కేటీఆర్ భోజనం చేశారు. స్వామి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం, హెయిర్ కటింగ్ సెలూన్ గురించి ఆరా తీశారు. స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని వ్యక్తిగతంగా కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు.
దాంతో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం కోసం రూ.5.50లక్షలు మంజూరు చేయించారు. మిగతా ఇంటి నిర్మాణ పనులను కార్యాలయంతో పర్యవేక్షించి, పూర్తి చేసేలా చొరవ చూపారు. మంత్రి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ సీనియర్ నేత కర్నాటి విద్యాసాగర్‌రావు ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. pic.twitter.com/ZvYMGL6W27
— Namasthe Telangana (@ntdailyonline) October 13, 2022