హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలిచిందని మహేష్ బిగాల(బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ రంగంలో అంతర్జాతీయ సంస్థలను కేటీఆర్ తెలంగాణ తీసుకు వచ్చారు.
ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ ముందింది, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసిందన్నారు. నిజామాబాద్ (Nizamabad) ఐటీ టవర్ (IT Tower) ప్రారంభానికి సిద్ధమైంది. ఇందుకు గాను మంత్రి కేటీఆర్
పలు సార్లు అమెరికా పర్యటనకు వెళ్లి తెలంగాణలో పెట్టుబడులు పెట్టించేందుకు ఐటీ కంపెనీలతో చర్చించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు . అమెరికాలో ఇప్పటికే నిజామాబాద్ ఐటీ హబ్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు 15 ఐటీ కంపెనీలు సిద్ధం అయ్యాయి. త్వరలోనే కార్యకలాపాలు మొదలు అవుతాయి అని చెప్పారు.
ఇదంతా కేటీఆర్ కృషి వల్లే సాధ్యమైందని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్‌లో అంతర్జాతీయంగా పేరొందిన హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఈ మేరకు మహేష్ బిగాల సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీర్‌కు నిజామాబాద్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.