2014లో ముడి చమురు ధర బ్యారెల్ 105 డాలర్లు ఉంటే, ఇప్పుడూ అంతే ఉన్నది. పెట్రోల్, డీజిల్ ధర అప్పుడు రూ.70 ఉంటే, ఇప్పుడు రూ.120. తెలంగాణ ఇప్పటివరకు వ్యాట్ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఏ సన్నాసి నిర్వాకంతో ధరలు పెరిగాయో..వాళ్లే తగ్గించాలి.
–మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ అనుసరిస్తున్న గుజరాత్ అనుకూల విధానాలపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ‘కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి నో చెప్పారు. కానీ గుజరాత్‌కు ప్రధాని మోదీ రూ.21,969 కోట్ల ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇదీ గుజరాత్ మోడల్ రాజకీయాలు, పరిపాలన’ అని రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ట్వీట్ చేశారు. దీన్ని రీ ట్వీట్ చేసిన కేటీఆర్ “ఆఫ్ గుజరాత్, బై గుజరాత్, ఫర్ గుజరాత్ అండ్ టు గుజరాత్..ఇది ‘మోదీ’డెమోక్రసీకి కొత్త నిర్వచనం.
కాజీపేటలో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తామని పార్లమెంట్లో వాగ్దానం చేసి నిరాకరించారు. ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు’అని కేటీఆర్ చురకలు అంటించారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మద్దతుగా నెటిజన్లు గుజరాత్ కోసం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని నిలదీశారు. ‘తెలంగాణకు దక్కాల్సిన సంప్రదాయ వైద్య కేంద్రాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి బదులు ఏర్పాటుచేస్తామన్న లోకోమోటివ్ ఇంజిన్ ఫ్యాక్టరీకి గుజరాత్లో రూ.21,969 కోట్లతో మోదీ శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర బీజేపీ నాయకులకు గుజరాత్‌కు గులాంగిరీ చేసుడు తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవు.. ఇది వివక్ష కాదా’అని ప్రశ్నించారు. ‘కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ రూ. 3,65,797 కోట్లు ఇస్తే, కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1,68,647 కోట్లు మాత్రమే వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మీటింగ్‌లో మంత్రి కేటీఆర్ చెప్పిన లెక్కలు కరెక్ట్ అని ఒప్పుకొన్నారు. ఇదీ బండి మాట్లాడిన వీడియో’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరి మిగిలిన రూ.1,97,150 కోట్లు గుజరాత్‌కు పంపిస్తుందా బీజేపీ?అని ప్రశ్నించారు.