హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని వంద జన్మలెత్తినా సాధించలేరని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చురక అంటించారు. దేశానికి తెలంగాణ టీచింగ్ పాయింట్ అన్న కేటీఆర్.. రాహుల్ చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు కాళేశ్వరం జలాలను నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండని ట్విట్టర్లో ధ్వజమెత్తారు.