హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణ పతక కలను సాకారం చేసిన బంగారు కొండ నీరజ్ చోప్రా. అథ్లెటిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సూపర్ షో కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. అథ్లెటిక్స్‌లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు.
ఈ అద్భుత విజయంపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రోలో దేశానికి మొట్టమొదటి బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు. నిన్ను చూసి భారత్ గర్వపడుతుందని పేర్కొన్నారు.
Congratulations to @Neeraj_chopra1 on winning the first ever #Gold medal for India at @Olympics in Men's Javelin throw. India is proud of you! 👏👏 pic.twitter.com/6g1rkQio30
— KTR (@KTRTRS) August 7, 2021