వికారాబాద్/హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి కేటీఆర్‌ను గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టానికి ఫలితంగా మంత్రి మహేందర్‌రెడ్డికి మంచి రోజులు వచ్చాయని, పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయని వెల్లడించారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ మహేందర్‌రెడ్డికి సూచించారు.