హైదరాబాద్ : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం దురదృష్టకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు మరో 11 మంది సైనికులు మృతి చెందడం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. మృతి చెందిన సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
Shocked and deeply saddened by the demise of CDS General Bipin Rawat Ji, his wife, and the other armed forces officials in an unfortunate helicopter crash. Heartfelt condolences to their families & friends 🙏
— KTR (@KTRTRS) December 8, 2021