Minister KTR | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులకు అండగా నిలవాలని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. అటు.. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను వారం పాటు వాయిదా వేస్తున్నట్టు ఆయన గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వానలు తగ్గుముఖం పట్టాక రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా నిరసనలు కొనసాగిస్తుందని తెలిపారు.