KTR Birthday | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్‌పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శనను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అంతకు ముందు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేశారు.
ఇసుకతో రూపొందించిన కేటీఆర్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద కళాకారుల ప్రదర్శనలు, డప్పుచప్పుళ్లతో సందడిగా మారింది. ఈ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు.