Minister KTR | గవర్నెన్స్‌లో ఇన్నోవేషన్ రావాలి.. త్రీ ఐ నినాదంతో వెళ్తేనే దేశాభివృద్ధి సాధ్యం: మంత్రి కేటీఆర్
యువతలోనేకాకుండా గవర్నెన్స్‌లోనూ ఇన్నోవేషన్ రావాలని, త్రీ ఐ నినాదంతో ముందుకెళ్తేనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్)లో రూ. కోటి 26 లక్షలతో ఏఐసీసీటీఈ ఐడియా ల్యాబ్ కేంద్రాన్ని మాజీ రాజ్యసభ సభ్యుడు, కిట్స్ చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, శాసనసభ సభ్యులతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
- నేను ఎన్నడో ప్రధాని మోదీకి ఈ విషయం చెప్పా
- ఏఐసీసీటీఈ ఐడియా ల్యాబ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR | హనుమకొండ సబర్బన్/హసన్‌పర్తి, మే 5: యువతలోనేకాకుండా గవర్నెన్స్‌లోనూ ఇన్నోవేషన్ రావాలని, త్రీ ఐ నినాదంతో ముందుకెళ్తేనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్)లో రూ. కోటి 26 లక్షలతో ఏఐసీసీటీఈ ఐడియా ల్యాబ్ కేంద్రాన్ని మాజీ రాజ్యసభ సభ్యుడు, కిట్స్ చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, శాసనసభ సభ్యులతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. దేశంలో అత్యుత్తమమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వేగంగా ఏర్పాటు చేసేందుకు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలని, అవసరమైతే అప్పులు చేయడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. ‘ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి.. లేకుంటే ప్రైవేట్ ఉద్యోగం చేసి, రిటైర్‌మెంట్‌నాటికి ఇల్లు కట్టుకోవాలనేది నాటి తరం ఆలోచన.
కానీ ఈ జనరేషన్ ఉద్యోగంలో చేరిన వెంటనే తమ నైపుణ్యాలపై నమ్మకంతో ఈఎంఐ పద్ధతిలో ఇండ్లు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. తరాలు మారేకొద్దీ ఆలోచనలు మారుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. సమాజంలో వచ్చిన మార్పులకనుగుణంగా ప్రభుత్వాల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని స్పష్టంచేశారు. మన దేశ ఆర్థిక విధానాలు మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సాంకేతికతను వినియోగిస్తూ చేసేది మాత్రమే ఇన్నోవేషన్ కాదని, మన నిత్య జీవితంలో ఉన్న సమస్యల పరిషారానికి ఇన్నోవేషన్‌ను ఉపయోగించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తరహాలో ఆలోచించి ప్రజా సమస్యల పరిషారానికి నూతన పంచాయతీరాజ్ చట్టం, నూతన మున్సిపల్ చట్టం, టీఎస్ బీపాస్, టీఎస్ ఐపాస్వంటి పాలసీలను రూపొందించిందని వెల్లడించారు. 20 రోజుల్లోనే భవన నిర్మాణ, 15 రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, 85% మేర మొకల సంరక్షణ వంటివి రాష్ట్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ అని వివరించారు. హైదరాబాద్‌తోపాటు ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్వంటి నగరాలకు సైతం ఐటీ విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు.
ఉద్యోగాలిచ్చేస్థాయికి ఎదగాలి
త్రీ ఐ నినాదంలో ప్రభుత్వంతోపాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని, విద్యార్థులు పాసైన తరువాత ఔత్సాహికవేత్తలుగా ఎదిగేందుకు రిస్ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. జపాన్ దేశంలో 15 శాతం మాత్రమే భూ భాగం నివాసయోగ్యంగా ఉంటుందని, వనరులు లేకపోయినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, న్యూక్లియర్ దాడులు జరిగినా అకడ ప్రజలు మానవ మేధస్సు పెట్టుబడిగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగారని పేర్కొన్నారు. చైనా దేశం ప్రపంచంలో ఉన్న అగ్రగామి దేశాలైన అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ దేశాలతో పోటీపడితే.. భారతదేశం మాత్రం పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌తో పోల్చుకుంటూ ఇక్కడే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
కులం, మతంలాంటి అవలక్షణాలు మన దేశానికి అభివృద్ధి నిరోధంగా మారాయని తెలిపారు. భవిష్యత్ తరాలు విద్వేషాలను వదిలిపెట్టి, దేశ అభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఎం పీ పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి, బసవరాజు సారయ్య , ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, దాస్యం వినయ్‌భాసర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, శంకర్‌నాయక్‌తోపాటు వొడితల కిషన్‌రావు, ఇంద్రనీల్, ప్రణవ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్త పట్నాయక్, ప్రావీణ్య, కిట్స్ ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

